సుచీలీక్స్‌: నా ఫొటోల‌పైనే అంత ఫోక‌స్ ఎందుకు-రానా

218
- Advertisement -

సౌత్ సినిమా సెల‌బ్రిటీస్‌ని సుచీలీక్స్ హ‌డ‌లెత్తించాయి. ఈ లీక్స్‌ తో తమిళ స్టార్ హీరో హీరోయిన్లకు షాక్‌ల మీద షాక్ లు ఇచ్చింది గాయని సుచిత్ర. అయితే ఇందులో మ‌న తెలుగు హీరోల పాత్ర కూడా చెప్పుకోద‌గ్గదే.

ముఖ్యంగా యువ‌హీరో రానా .. అందాల త్రిష‌ను ముద్దాడుతున్న పిక్‌ని సుచీలీక్స్ బ‌హిర్గ‌తం చేసి, రానాను కూడా ఇరకించేసిన విషయం తెలిసిందే. సుచిత్ర తన ట్విట్టర్ అకౌంట్‌ ద్వారా వీరద్దరి క్లోజ్‌ ఫోటోను లీక్ చేసింది. రానా,త్రిష చెంప మీద గాఢంగా ముద్దు పెడుతున్న ఫోటోను సుచి ట్వట్టర్ అకౌంట్‌ నుంచి లీక్‌ అవడంతో..ఆ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
 Rana Daggubati opens up on Suchitra's leaked pic
ఇక ఈ వ్యవహారం పై ప్రస్తుతం హడావిడి తగ్గుతున్న సమయంలో కొంత మంది సెలెబ్రిటీలు వారి ఫొటోల లీక్స్‌ పై స్పందించారు. ఇక ఈ విషయం పై మిగిలిన స్టార్స్‌ కూడా ఎలా స్పందిస్తారా అని అందరూ అనుకున్నారు. అయితే ఈ వ్య‌వహారంపై అప్ప‌ట్లో రానా ఏమాత్రం స్పందించ‌లేదు. కానీ ఇప్పుడు  రానా కూడా సుచి లీక్స్‌ పై స్పందించాడు.

`ది రైజ్ ఆఫ్ శివ‌గామి` పుస్త‌కావిష్క‌ర‌ణ‌లో మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు రానా స్పందిస్తూ .. ”త్రిష నాకు మంచి స్నేహితురాలు. త‌న‌తో ఎలాంటి ఎఫైర్ లేదు. అయినా ఇంత చిన్న విషయానికి మీడియా ఎందుకు పెద్దది చేస్తుందో అర్ధం కావడం లేదు. సినీ పరిశ్రమలో ఎన్నో ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. కేవలం నా ఫొటోల‌పైనే అంత ఫోక‌స్ ఎందుకు? బాహుశా నేను వాళ్ల కంటే పెద్ద స్టార్‌ని అనుకుంటా!!“ అంటూ త‌న‌దైన శైలిలో స్పందించాడు రానా.
 Rana Daggubati opens up on Suchitra's leaked pic
అసలు ఆ ముద్దును లైట్ తీస్కోకుండా కావాల‌నే ఇలా ప‌బ్లిసిటీ చేస్తున్నారంటూ సూటిగానే ఖండించాడు రానా. మరి ఈ భల్లాలదేవుడు తర్వాత ఈ లీక్స్‌ పై  ఏ స్టార్‌ స్పందిస్తారో చూడాలి.
మొత్తానికి రానా అనే’ స్నేహితుడు’.. త్రిష అనే ‘స్నేహితురాలి’ చెంప మీద గాఢంగా ముద్దు పెడుతున్న ఫోటో లీక్‌పై  రానా స్పందించి ఫ్యాన్స్‌ కి ఫుల్‌ క్లారిటీ ఇచ్చాడనే చెప్పాలి.

- Advertisement -