రైతుపై షూతో దాడిచేసేందుకు ప్రయత్నించాడు ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత. లక్నోలోని శరహణ్ పూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనతో బీజేపీ విమర్శల పాలైంది. చెరుకు పంట బకాయిలు చెల్లించాలని అడిగినందుకు ఓ రైతుపై ఆగ్రహంతో ఊగిపోయాడు బీజేపీ నేత. రైతుపై షూతో దాడిచేసేందుకు ప్రయత్నించాడు ఆ జిల్లా బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర కశ్యప్.
లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వచ్చిన విజయేంద్ర కశ్యప్‌ను చెరుకు పంట బకాయిలు చెల్లించాలని భారతీయ కిసాన్ యూనియన్ లీడర్ అరుణ్ రాణా నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన కశ్యప్ షూతో రైతుపై దాడి చేయబోయాడు. దీంతో అక్కడున్న నేతలంతా షాకయ్యారు. అయితే రైతులు కశ్యప్‌ను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనన్నాయి. చెరుకు పంట రైతులకు రూ. 10 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని అడిగితే షూతో దాడిచేసేందుకు ప్రయత్నించారని రైతులు ఆరోపిస్తున్నారు.
రైతుపై బీజేపీ నేత దాడిచేయడానికి ప్రయత్నించడాన్ని తప్పుబట్టాయి కాంగ్రెస్,ఎస్పీ. బీజేపీ భారతీయ ఝూటా పార్టీ అని కాంగ్రెస్ నేతలు పేర్కొనగా ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ నేతలు సహనం కొల్పోతున్నారని ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ అన్నారు.