అన్‌స్టాపబుల్..NBKతో CBN రికార్డు వ్యూస్!

144
NBK
- Advertisement -

నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తొలి సీజన్‌కు మంచి రెస్పాన్స్‌రావడమే హైయెస్ట్ టీఆర్పీతో టాప్‌ రేటింగ్‌లో నిలిచింది. ఇక…రెండో సీజన్‌ ఫస్ట్ ఎపిసోడ్‌కి గెస్ట్‌గా వచ్చారు బాలయ్య బావ టీడీపీ అధినేత నారా లోకేష్, అల్లుడు నారా లోకేష్.

అన్‌స్టాపబుల్ సీజన్ 1 రికార్డులను బ్రేక్ చేస్తూ అత్యధిక వ్యూస్ రాబట్టింది. చంద్రబాబు, లోకేష్ వచ్చిన ఈ అన్‌స్టాపబుల్ ఫస్ట్ ఎపిసోడ్‌ని 24 గంటల్లో ఏకంగా 10 లక్షల మంది పైగా వీక్షించారు. ఓటీటీ వేదికగా ఇదో సంచలన రికార్డు అని ఆహా అధికారికంగా ప్రకటించింది.

అలాగే ఈ షోతో ఆహా సబ్‌స్క్రైబర్స్ కూడా భారీగా పెరిగారు. దీంతో అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఆహా టీం అందరికి మరింత ఎనర్జీ ఇచ్చింది.

- Advertisement -