- Advertisement -
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లోని ప్రశషన్ నగర్ లో బిగ్ బాస్ 6 కాంటెస్టెంట్ బ్లాక్ స్టార్ శాని ఇచ్చిన ఛాలెంజ్ ని స్వికరించి మొక్కలు నాటారు నటి లతా రెడ్డి.
ఈ సందర్భంగా లతా రెడ్డి… మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లాంటి గొప్ప కార్యక్రమం లో పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటుతే మనకే కాదు మన తరాలకు ఆక్సీజన్ అందించిన వారము అవుతాము అన్నారు. ఇంత గొప్ప అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యులు జోగిపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా వినిషా, మహి, మురళీ వీరిని ఈ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు.
- Advertisement -

