అసెంబ్లీలో కాంగ్రెస్ నేతల బరితెగింపు

197
- Advertisement -

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయిన కొద్దిసేపటికే కాంగ్రెస్‌ శాసనసభ్యులు అసెంబ్లీలో వీరంగం సృష్టించారు. ఓ వైపు గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగింస్తుండగానే ఆయన ప్రసంగానికి అడ్డుతగిలిన కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌ ప్రసంగ ప్రతులను చింపి ఆయనమీదికి విసిరివేశారు.

 swamygoudatk

అంతటితో ఆగకుండా కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా గవర్నర్‌ నరసింహన్‌ పైకి మైక్‌ హెడ్‌ ఫోన్‌ ను విసిరేశాడు. అది గాంధీ ఫోటోకు తాకి ఫోటో కిందే ఉన్న మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ కన్నుకు తగిలింది. దీంతో స్వామిగౌడ్‌ కన్నుకు తీవ్ర గాయమైనట్టు తెలుస్తోంది. వెంటనే స్వామిగౌడ్‌ ను వైద్య చికిత్సల కోసం సరోజిని దేవి కంటి ఆస్పత్రికి తరలించారు. స్వామిగౌడ్‌ కు సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిండు అసెంబ్లీలో కాంగ్రెస్‌ నేతలు సృష్టించిన వీరంగంపై టీఆర్‌ఎస్‌ నేతలు మండిపడుతున్నారు.

palla rajeshwar reddy

కాంగ్రెస్‌ నేతలు అసెంబ్లీ సమావేశాలకు మద్యం సేవించి హాజరయ్యారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీన వర్గాలకు చెందిన స్వామిగౌడ్‌ పై దాడికి పాల్పడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అసెంబ్లీ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్‌ చేయాలని టీఆర్‌ఎస్‌ నేతలు డిమాండ్‌ చేశారు.  కాంగ్రెస్‌ నేతలు నిండు అసెంబ్లీలో దుర్మార్గ చర్యలకు పాల్పడ్డారని సభా మర్యాదలు లేకుండా ఉన్మాదులుగా వ్యవహరించారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -