ఉన్నావ్ కేసు..కుల్దీప్‌ను దోషిగా తేల్చిన ఢిల్లీ కోర్టు

643
kuldeep
- Advertisement -

ఉన్నావ్ అత్యాచార కేసులో తీర్పు వెలువరించింది ఢిల్లీ కోర్టు. ఈ కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్‌ను దోషిగా తేల్చిన న్యాయస్ధానం డిసెంబర్ 19న శిక్షను ఖరారు చేయనుంది.

ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తనపై అప్పటి బిజెపి ఎమ్మెల్యే కుల్‌ దీప్‌ సెంగర్‌ లైంగిక దాడికి పాల్పడ్డారని రెండేళ్ల క్రితం ఉన్నావ్ బాధితురాలు ఆరోపించింది. ఈ కేసులో కుల్‌దీప్‌, అతని సోదరుడు అతుల్‌ సింగ్‌లకి జైలు శిక్ష విధించింది న్యాయస్ధానం.

ఇక కేసు విచారణలో భాగంగా సదరు యువతి తన బంధువులు, న్యాయవాదితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఓలారీ ఢీకొట్టింది. దీంతో యువతి బంధువులు ఇద్దరు మరణించగా.. ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం వెనుక కుల్‌దీప్‌సింగ్‌ హస్తముందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రెండు సంవత్సరాల తర్వాత ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది.

The Unnao rape case refers to the gang rape of a 17-year-old girl on 4 June 2017 in Unnao, Uttar Pradesh, India. To date, two charge sheets have been filed in the case

- Advertisement -