ధోనీ-సచిన్‌ల మధ్య తేడా ఏంటో తెలుసా..?

287
unlike-ms-dhoni-sachin-tendulkar-didnt-charge-a-single-penny
unlike-ms-dhoni-sachin-tendulkar-didnt-charge-a-single-penny
- Advertisement -

బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే క్రీడాకారుల మీద ‘బాగ్‌ మిల్కా బాగ్‌’, ‘మేరీకోమ్‌’ లాంటి సినిమాలు వచ్చాయి. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. బాక్సింగ్‌.. రన్నింగ్‌..లపై సినిమాలు ఇంతలా ఉంటే మరీ క్రికెటైతే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా ఇటీవల భారత క్రికెట్ కెప్టెన్‌ కూల్ మహేంద్ర సింగ్ ధోనీపై బయోపిక్ వచ్చిన సంగతి తెలిసిందే. సాధారణంగా బయోపిక్‌లు క్రీడల్లో కెరీర్ ముగిసిన తరువాత వస్తాయి.అయితే ధోనీ మాత్రం కెరీర్‌లో కొనసాగుతుండగానే తనపై సినిమా తీయడానికి ఒప్పుకున్నాడు. మరీ రాయల్టీగా ఎంత తీసుకున్నాడో తెలుసా.. అక్షరాల నలబై కోట్ల రూపాయలు తీసుకున్నాడని సమాచారం.

sachin

క్రికెట్ దేవుడు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ జీవిత కథ ఆధారంగా సచిన్‌ స్వయంగా నటిస్తున్న సినిమా ‘సచిన్‌-ఎ బిలయన్‌ డ్రీమ్స్‌’. సచిన్‌ స్నేహితుడైన రవి భాగ్‌చంద్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఒప్పుకున్నాడట సచిన్. దాదాపు రెండు దశాబ్దాలు తన ఆటతో అలరించిన సచిన్‌.. విలువలను పాటించడంలో తనకు తానే సాటి అని ప్రూవ్ చేసుకున్నాడు. సినిమా షూటింగ్ సందర్భంగా భారత జట్టుతో అతనికి ఉన్న అనుబంధం.. అనుభవాలను సవివరంగా చెప్పాడట సచిన్. ధోనీకి సచిన్‌కి అదే తేడా అంటూ సోషల్ మీడియాలో సచిన్ అభిమానులు గొప్పలు చెప్పుకుంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఎంఎస్ ధోనీ.. ది అన్టోల్డ్ స్టోరీ భారీ కలెక్షన్లు సాధిస్తోంది. శుక్రవారం దేశ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఓపెనింగ్ వీకెండ్లో రూ.66 కోట్లు(గ్రాస్) వసూలు చేసినట్లు ఫిల్మ్ మేకర్స్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. తొలిరోజు 21.30 కోట్ల రూపాయలు రాగా, రెండో రోజు శనివారం 20.60 కోట్లు వసూలు చేసింది. ఆదివారం కూడా భారీ కలెక్షన్లు ఉండటంతో మొత్తంగా రూ.66 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు ఫిల్మ్ మేకర్స్ పేర్కొన్నారు. దాంతో 2016లో చిత్ర ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్ల లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచినట్లు ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ ట్వీట్ చేశారు.

- Advertisement -