తెలంగాణ ‘త్యాగాల వీణ’ ఆడియో

229
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర కోసం పోరాడిన ఉద్యమకారుల త్యాగాలను భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనే లక్ష్యంతో రూపోందించిన చిత్రం “త్యాగాల వీణ “. సుమన్ ,శివక్రిష్ణ , ప్రీతినిగమ్ , సుమశ్రీ , రాజీ , మధుబాల ,ఇంద్ర ,రాజీవ్ ప్రధానపాత్రధారులుగా ప్రేమ్ మూవీస్ బ్యానర్ పై కొత్తపల్లి సతీష్ బాబు నిర్మాణంలో మిర్యాల రవికుమార్ దర్శకత్వం ఈ సినిమా తెరకెక్కింది. రమేష్ ముక్కెర సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియోని సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ చిత్ర యూనిట్‌ని అభినందించారు. తెలంగాణ ఉద్యమం జరిగిన తీరును భవిష్యత్తు తరాలకు అందించాలనే లక్ష్యంతో సినిమా తెరకెక్కించడం బాగుందన్నారు. రమేష్ ముక్కెర సంగీతం బాగుందని..భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు రావాలని ఆకాంక్షించారు.

unnamed (2)

త్యాగాల వీణ చిత్రం ఆడియో కేసీఆర్ ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు దర్శకులు ముక్కెర రమేష్. భవిష్యత్తులోను మంచి చిత్రాలు తీయడానికి కృషిచేస్తామన్నారు. రమేష్ ముక్కెర అందించిన పాటలు బాగున్నాయని కెసీఆర్ అభినందంచడం మా టీమ్ కు మంచి ఉత్సహాన్ని ఇచ్చిందన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, కరీంనగర్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి , తెలంగాణ సాంస్క్రతి సారధి రసమయి బాలకిషన్ , అసిస్టెంట్ డైరెక్టర్ రాయల బిక్షం, పలువురు ఎమ్మేల్యేలు ,మంత్రులు పాల్గొన్నారు..

బ్యానర్ : ప్రేమ్ మూవీస్ , నటీనటులు : సుమన్ ,శివక్రిష్ణ , ప్రీతినిగమ్ , సుమశ్రీ , రాజీ , మధుబాల ,ఇంద్ర ,రాజీవ్ , సంగీతం : రమేష్‌ ముక్కెర, కెమెరా : డి. యాదగిరి, ఎడిటర్‌ : గడ్డం. సంతోష్‌, నిర్మాత : కొత్తపల్లి సతీష్‌ బాబు,సహా నిర్మాత :చింతా రెడ్డి వినోద్ రెడ్డి , స్క్రీన్‌ ప్లే-మాటలు-దర్శకత్వం : మిరియాల రవికుమార్‌.

- Advertisement -