ఫోన్‌లో యాప్స్ ఆన్ ఇన్స్టాల్ చేస్తే ఇలా చేయండి!

66
- Advertisement -

నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ వాడకం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మన డైలీ యుసెజ్ లో స్మార్ట్ ఫోన్ ఓ భాగమైంది. బ్యాంకింగ్ లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు, సోషల్ మీడియా, స్ట్రీమింగ్ కంటెంట్,.. ఇలా ప్రతిదానికి స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. కాగా మన వాడకాన్ని బట్టి మొబైల్ లో యాప్స్ ను ఇన్ స్టాల్ చేసుకుంటూ ఉంటాము. అయితే కొన్ని యాప్స్ ను అలాగే ఉంచుకుంటాము..మరికొన్ని యాప్స్ ను అవసరాన్ని బట్టి డిలీట్ చేస్తూ ఉంటాము. అయితే ఏదైనా అప్లికేషన్ ను డిలీట్ చేసిన తరువాత ఒక ముఖ్యమైన పని చేయాల్సి ఉంటుంది. అదే మన గూగుల్ అకౌంట్ కి ఆ యాప్ ను డిస్కనెక్ట్ చేయడం. ఇలా చేయకపోవడం వల్ల మనం ఆన్ ఇన్స్టాల్ చేసిన తరువాత కూడా మొబైల్ లో ఆ యాప్ రన్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఏదైనా అప్లికేషన్ ను డిలెట్ చేసిన వెంటనే ఆ యాప్ ను గూగుల్ అకౌంట్ నుంచి పూర్తిగా డిస్కనెక్ట్ చేయాలి. మరి ఈ ప్రాసస్ ఏ; ఎలా చేయాలో చూద్దాం.

Also Read:బీజేపీతో జేడీఎస్ దోస్తీ.. వద్దనుకున్న తప్పలేదా?

* ముందుగా మొబైల్ ఓపెన్ చేసిన తరువాత సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి.
* ఆ తరువాత సెట్టింగ్స్ లో గూగుల్ వద్ద క్లిక్ చేయాలి.
* గూగుల్ ఎంచుకున్న తరువాత కిందకి స్క్రోల్ చేస్తే “సెట్టింగ్ ఫర్ గూగుల్ యాప్స్ ” అనే ఆప్షన్ కనిపిస్తుంది.
* సెట్టింగ్స్ ఫర్ గూగుల్ యాప్స్ ను క్లిక్ చేస్తే కనెక్టెడ్ యాప్స్ అని కనిపిస్తుంది. దానికి క్లిక్ చేయాలి

ఇప్పటివరకు మన గూగుల్ అకౌంట్ తో ఎన్ని యాప్స్ ను కనెక్ట్ చేశామో లిస్ట్ అంతా అక్కడ కనిపిస్తుంది. అందులో డిలీట్ చేసిన యాప్స్ కూడా ఉంటే వెంటనే వాటిని గూగుల్ నుంచి డిస్కనెక్ట్ అయ్యేలా అక్కడ ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ఆన్ ఇన్స్టాల్ చేసిన యాప్స్ ను వెంటనే గూగుల్ నుంచి డిస్కనెక్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల సెక్యూరిటీ పరంగా ఎంతో మేలని టెక్ నిపుణులు చెబుతున్నారు.

Also Read:100 డేస్ బీజేపీ వ్యూహం!

- Advertisement -