ట్విట్టర్‌కు కేంద్రం మరోసారి వార్నింగ్..

216
twitter
- Advertisement -

భారత ప్రభుత్వం – ట్విట్టర్ మధ్య వార్ కొనసాగుతోంది. దేశంలో అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ నిబంధనలను పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది భారత సర్కార్‌. లేదంటే చ‌ట్ట‌ప‌ర‌మైన ప‌ర్య‌వ‌సానాల‌ను ఎదుర్కోక‌త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించింది.

ఉన్నతస్ధాయి సమీక్షా సమావేశంలో మాట్లాడిన కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్…ఈ మేరకు ట్విట్టర్‌కు నోటీసులు జారీ చేశారు. గ‌త నెల 26 నుంచి కొత్త ఐటీ నిబంధనలు అమ‌ల్లోకి వ‌చ్చాయని వెల్డించారు. అప్ప‌టికే సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌కు మూడు నెల‌ల స‌మ‌యం ఇచ్చామని తెలిపారు.

అయితే కొత్త ఐటీ నిబంధనకు ఫేస్‌బుక్ లాంటి సంస్థ‌లు ఓకే చెప్పినా.. ట్విట్ట‌ర్ మాత్రం వీటికి ఇంకా అంగీకారం తెల‌ప‌లేదు. దీంతో ఆ సంస్థకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది కేంద్రం.

- Advertisement -