పెళ్లి వార్తలకు చెక్ పెట్టిన వకీల్ సాబ్ బ్యూటీ..!

41
anjali

తన పెళ్లి గురించి వస్తున్న పుకార్లకు చెక్ పెట్టింది వకీల్ సాబ్ బ్యూటీ అంజలీ. తన పెళ్లిపై వస్తున్నవన్నీ పుకార్లేనని తేల్చి చెప్పింది. తనకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని …ప్రస్తుతం తన దృష్టి సినిమాలపై మాత్రమే ఉందని స్పష్టం చేసింది.

రానున్న రోజుల్లో మంచి పాత్రలు పోషించాలని అనుకుంటున్నానని.. చిత్రనిర్మాతలను మంచి పాత్రల కోసం తనను సంప్రదించడం లేదన్నారు. మంచి ఆఫర్లు వచ్చే వరకు వేచి ఉంటానని తెలిపింది.

వకీల్ సాబ్ తర్వాత ఏ ప్రాజెక్టుకు సంతకం చేయలేదు అంజలి. అయితే రెండు మూడు పెద్ద ప్రాజెక్టుల కోసం చర్చలు జరుపుతున్నట్ల టాక్.