చెస్ ప్లేయర్‌కు మంత్రి కేటీఆర్ సాయం..

84
ktr

మంత్రి కేటీఆర్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన బ‌ధిర చెస్ ప్లేయ‌ర్ మ‌లికా హండాకు 15 లక్షల సాయం అందించారు. త‌న కుటుంబ స‌భ్యుల‌తో కేటీఆర్‌ను ఆమె క‌లిశారు. చెస్ పోటీల కోసం సిద్ధమ‌య్యేందుకు ఉప‌యోగ‌ప‌డే విధంగా ల్యాప్‌టాప్‌ను కూడా కేటీఆర్ బహుమతిగా అందించారు.

మ‌లికాకు ప్రభుత్వ ఉద్యోగం క‌ల్పించాల‌ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కేటీఆర్ కోరారు. మంత్రి కేటీఆర్‌కు మ‌లికాతో పాటు ఆమె కుటుంబ స‌భ్యులు ధన్యవాదాలు తెలిపారు.

మ‌లికా హండా.. బధిర చెస్‌ ప్లేయర్‌. పంజాబ్‌కు చెందిన మలిక పుట్టుకతోనే చెవిటి, మూగ సమస్యలతో బాధపడుతోంది. తన ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని నిరూపించింది. ఆమె ఇప్పటివరకూ ప్రపంచ టోర్నీతో పాటు ఆసియా చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు గెలుచుకుంది.