రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్రం సూత్రప్రాయ ఆమోదం

250
kishan reddy
- Advertisement -

కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పలువురు తెలంగాణ బీజేపీ నేతలు.రీజనల్ రింగ్ రోడ్డు అంశంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశామన్నారు కిషన్ రెడ్డి. రీజనల్ రింగ్ రోడ్డు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది….40% మంది ప్రజలకు ఈ రింగ్ రోడ్డు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

తెలంగాణ రాష్ట్ర వికాసం ఈ రోడ్డు పైన ఆధారపడి ఉంటుంది…ఇప్పటికే హైదరాబాద్ రింగ్ రోడ్డు నగరానికి మంచి పేరు తెచ్చిపెట్టిందన్నారు. ఇంతకుముందు ఉన్న రింగ్ రోడ్డు కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది….సంగారెడ్డి నుండి చౌటుప్పల్ వరకు మొదటి దశలో నార్తర్న్ పార్ట్…158 కి.మీ మేర రింగ్ రోడ్డు నిర్మాణం చేయాలని కేంద్రం నిర్ణయించిందని వెల్లడించారు కిషన్ రెడ్డి.

దీనిని ఎన్ హెచ్ 161AA గా కేంద్రం గుర్తించింది…సుమారుగా రూ. 9,522 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంగా నిర్ణయించారని వెల్లడించారు. ఇవాళ దక్షిణవైపున రీజనల్ రింగ్ రోడ్డు కు విజ్ఞప్తి చేశాం…రెండో దశ చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు మంజూరు చేయాలని కోరాం అన్నారు. వీలైనంత త్వరగా దీనిని ఆమోదించాలని కోరామని…182 కిలో మీటర్ల రహదారి రూ. 6,881 వేల కోట్లు పైగా ఖర్చు చేయనున్నారని వెల్లడించారు.

రెండు దశల్లో సుమారు 17 వేల కోట్ల రూపాయలతో రీజనల్ రింగ్ రోడ్డు పూర్తవుతుంది…హైదరాబాద్ కు వచ్చే అన్ని హైవేలను కలుపుతూ ఈ రింగ్ రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు. రీజనల్ రింగ్ రోడ్డుతో లాజిస్టిక్ పార్కులు కూడా అభివృద్ధి జరుగుతుందని…వ్యవసాయ, ఉపాధి, పరిశ్రమలు, ఐటి రంగాల అభివృద్ధి, పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ రింగ్ రోడ్డు నిర్మాణంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెరుగుతుందని…రీజనల్ రింగ్ రోడ్డు కోసం భూ సేకరణ వేగంగా చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా అని చెప్పారు.

- Advertisement -