- Advertisement -
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన కిషన్ రెడ్డి…ఏపీ సీఎస్, డీజీపీతో మాట్లాడి పరిస్ధితిని సమీక్షించారు.
దుర్ఘటన జరిగిన ప్రాంతంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మురం చేయాల్సిందిగా ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని..ఏపీకి కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తామని స్పష్టం చేశారు.
ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన రసాయన వాయువు లీక్ కావడంతో ఇప్పటికే 8 మంది చనిపోయారు. సుమారు 200 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
- Advertisement -