కేంద్రమంత్రి ఛాలెంజ్‎ని స్వీకరించిన హృతిక్ రోషన్..

185
Union Minister Rajyavardhan Rathore issues fitness challenge
- Advertisement -

ఐస్ బకెట్ ఛాలెంజ్, రైస్ బకెట్ చాలెంజ్ లాగానే నేడు మరో ఛాలెంజ్ వచ్చింది. ‘హామ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ అనే పేరుతో కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ బాలీవుడ్ నటుడు హృతిక్‌ రోషన్‌, క్రీడాకారులు విరాట్‌ కోహ్లీ, సైనా నెహ్వాల్‌లకు సవాలు విసిరారు. అయితే మంత్రి సవాల్ ను హీరో హృతిక్ రోషన్ స్వీకరించారు. ఫిట్‌గా ఉండేందుకు నేను రోజూ నడుస్తాను, సైక్లింగ్‌, జాగింగ్‌ చేస్తాను. ప్రతిరోజూ ఆఫీస్‌కు సైకిల్‌పై వెళ్తాను’ అని పేర్కొంటూ హృతిక్ ఓ వీడియోను పంచుకున్నారు.

Union Minister Rajyavardhan Rathore issues fitness challenge

సైనా కూడా ఈ ఛాలెంజ్ ని సైనా కూడా స్వీకరించింది. ఫిట్ ఉండేందుకు ఆమె చేసే కసరత్తుల వీడియోను పంచుకుంది. తను కూడా నటుడు రానా, పీవీ సింధు, గౌతమ్ గంభీర్ లకు ఛాలెంజ్ విసిరింది.భారతీయులందరూ ఫిట్ గా ఉండాలనే ఉద్దేశ్యంతో రాజ్యవర్ధన్‌ సింగ్‌ ‘హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌’ అనే ఛాలెంజ్‌తో స్వయంగా పుషప్స్‌ చేస్తున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ హార్డ్‌వర్క్‌, అతని శక్తి చూసి నేను స్ఫూర్తి పొందాను. భారత్‌దేశ ప్రజలంతా ఫిట్‌గా ఉండాలని మోదీ అభిలాష’ అందుకే ఈ ఛాలెంజ్‌ అని రాథోడ్‌ తెలిపారు.

- Advertisement -