ఈ రోజు కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో దక్షిణాది ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో జల్ జీవన్ మిషన్ అమలుపై చర్చ నిర్వహించారు. ఇందులో జల్ జీవన్ మిషన్ పథకం అమలుకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని అన్ని రాష్ట్రాలు కోరాయి. ఈ సందర్భంగా
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. జల్ జీవన్ మిషన్ పథకాన్ని యుద్ధప్రాతిపదికన అమలు చేసేందుకు రాష్ట్రాలు, అధికారులు కృషి చేయాలి. 2024 కల్లా పథకాన్ని పూర్తి చేయాలి. ఈ పథకం నిధుల కోసం నాబార్డ్, ఇతర ఆర్థిక సంస్థలను సంప్రదిస్తున్నాము. బడ్జెట్‌కు లోబడి రాష్ట్రాలకు నిధులు సమకురుస్తామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ అన్నారు.
మేము రోల్స్ రాయిస్ కాదు, మారుతి800లను సమకూర్చాల నుకుంటున్నాం. రాష్ట్రాలు జాగ్వార్ ఇస్తామంటే మీ ఇష్టం. వీలైనంత వరకు స్థానికంగా అందుబాటులో ఉండే నీటివనరులనే ఉపయోగించుకోవాలి.చివరి ప్రయత్నంగానీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీటిని తరలించే భారీ ప్రాజెక్ట్ లకు వెళ్లాలి. జల్ జీవన్ మిషన్‌లో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకం అని మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు.
తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి మాట్లాడుతూ.. కేంద్రం రాష్ట్రాలకు ఆర్థిక సహకరం అందించాలి. జల్ జీవన్ కోసం ఖర్చు చేసే నిధులను జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు ఇవ్వాలి. రాష్ట్రాలు రుణాలు తీసుకునే పరిమితిని పెంచాలని సీఎస్ ఎస్‌కే జోషి అన్నారు.