ఫ్లిప్ కార్ట్,అమెజాన్‌లకు షాక్‌..

252
amazon
- Advertisement -

ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌కు కేంద్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. దసరా పండగను క్యాష్ చేసుకునేందుకు బిలియన్ డేస్ పేరుతో భారీ ఆఫర్లతో వినయోగదారులను ఆకట్టుకుంటుండగా ఈ సంస్థల తీరుపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఒక వస్తువును వెబ్‌సైట్‌లో అమ్ముతున్నప్పుడు ఆ వస్తువు ఏ దేశంలో తయారైందన్న సమాచారాన్ని వినియోగదారుడికి తెలియజేయాలన్న తప్పనిసరి నిబంధనను ఈ-కామర్స్‌ సంస్థలు పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేసింది.దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఈ-కామర్స్‌ సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

భారత్ – చైనా మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో చైనా యాప్‌లను బ్యాన్ చేసింది కేంద్రం. ఈ నేపథ్యంలోనే పండగ ఆఫర్ల పేరుతో ఈ కామర్స్ సంస్థలు అమ్ముతున్న వాటిపై వివరణ ఇవ్వాలని తెలిపింది కేంద్రం.

- Advertisement -