- Advertisement -
కేంద్ర ప్రభుత్వం తన విధానాలతో ప్రజల నడ్డి విరుస్తోందని ఆరోపించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం చింతలపల్లి గ్రామంలో నాబార్డ్ నిధులతో నిర్మించిన 1500 మెట్రిక్ టన్నుల గోదాంను, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని ఆయన ఇవాళ ప్రారంభించారు.
అనంతరం మాట్లాడిన ఎర్రబెల్లి..దండుగా అన్న వ్యవసాయాన్ని పండగల చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు. రాష్ట్ర రైతులకు మహార్దశ కల్పించారని..రైతులకు పెట్టుబడి సహాయం అందించిన రైతు బంధువుడు కేసీఆర్ అన్నారు.
రూ. 400 రూపాయలు ఉన్న గ్యాస్ ధరను 1200 చేసింది బీజేపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలతో పాటు నిత్యవసర ధరలు పెంచిన కేంద్రం సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -