- Advertisement -
వివిధ రాష్ట్రాలలోని గ్రామ పంచాయతీలకు మరో దఫా నిధులను విడుదల చేసింది కేంద్ర ఆర్ధిక శాఖ. 18 రాష్ట్రాలకు రెండో విడతగా రూ.12,351 కోట్ల నిధులు విడుదల చేసింది కేంద్ర ఆర్ధిక శాఖ. మొదటి విడత విడుదల చేసిన నిధులకు సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికేట్ అందించిన 18 రాష్ట్రాలకు పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ సిఫారసు మేరకు నిధులను విడుదల చేసింది.
2020-21 సంవత్సరానికి గాను ఇప్పటివరకు రూ.45,738 కోట్లు గ్రామీణ స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి రూ.1,385.25 కోట్లు విడుదలయ్యాయి.
- Advertisement -