వ్య‌వ‌సాయంలో మ‌రింత పోటీత‌త్వం పెర‌గాలి

395
nirmala3
- Advertisement -

వ్యవసాయ రంగంలో మరింత పోటీతత్వం పెరగాలి అన్నారు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ సందర్భంగా లోక్ సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. 2022 సంవత్సరం కల్లా రైతుల ఆదాయన్ని రెట్టింపు చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. 2020 బ‌డ్జెట్ ప్ర‌జ‌ల ఆదాయాన్ని పెంచ‌నున్న‌ట్లు చెప్పారు. దీంతో ప్ర‌జ‌ల కొనుగోలు శ‌క్తి కూడా పెర‌గ‌నున్న‌ట్లు తెలిపారు.

వ్యవసాయ ఉత్పత్తలు మార్కెట్లను మరింత సరళతరం చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయంలో స‌మ‌గ్ర‌మైన పంట విధానాల‌ను అవ‌లంబించాల‌న్నారు. మోడ‌ల్ చ‌ట్టాల‌ను అమ‌లు చేసే రాష్ట్రాల‌ను మ‌రింత ప్రోత్స‌హించినున్న‌ట్లు మంత్రి తెలిపారు. నీటి ఎద్ద‌డి ఉన్న వంద జిల్లాల్లో ప్ర‌త్యేక ప్ర‌ణాళిక అమ‌లు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. సోలార్ పంపుల‌ను పెట్టుకునేందుకు సుమారు 20 ల‌క్ష‌ల రైతుల‌కు పీఎం కుసుమ్ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌నున్నారు.

- Advertisement -