- Advertisement -
స్కూళ్లలో చిన్నారుల అడ్మిషన్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కనీసం ఆరేళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో చేర్చుకోవాలని స్పష్టం చేసింది విద్యా శాఖ. కనిష్ఠ వయసును ఆరేళ్లుగా పేర్కొన్న కేంద్రం.. ఈ నిబంధన అమలయ్యేలా చూడాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ కోర్సు రూపకల్పన, అమలు ప్రారంభించాలని రాష్ట్రాలను కోరింది కేంద్ర విద్యాశాఖ.
మూడేళ్ల నుండి ఐదేళ్ల మధ్య వయసు ఉన్న పిల్లలకు ప్రీ స్కూల్ ఎడ్డుకేషన్ ఉంటుందని తెలిపింది.ఆటపాటలతో చదువుపై ఆసక్తి కలిగించేలా ప్రీ స్కూల్ విద్య ఉంటుందని వెల్లడించింది. ఆ తర్వాత ఒకటి,రెండో తరగతులు ఫౌండేషన్ స్టేజ్‌లో ఉంటాయన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న వయసు నిబంధనను నూతన విద్య విధానానికి అనుగుణంగా మార్చుకోవాలని సూచించింది.
ఇవి కూడా చదవండి..
- Advertisement -