Modi:మోదీ కేబినెట్ తొలి భేటీ

12
- Advertisement -

మూడోసారి పీఎంగా ప్రమాణస్వీకారం చేశారు నరేంద్ర మోడీ. కేబినెట్‌లో 71 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయగా ప్రధానితో కలిపి 30 మంది కేబినెట్ మంత్రులు, స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు ఐదుగురు కాగా, మిగతా 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.

ఇక ఇవాళ సాయంత్రం మోడీ కేబినెట్ తొలిసారి భేటీకానుంది. ఈ సందర్భంగా మంత్రులకు పనితీరుపై దిశానిర్దేశం చేయనున్నారు ప్రధాని. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు లీక్ కాకూడదని…అలాగే పలు అంశాలపై మంత్రులకు వివరించనున్నారు మోడీ.

ఆ తర్వాత శాఖల కేటాయింపు జరగనున్నట్లు సమాచారం. కేంద్ర బడ్జెట్‌కు టైం దగ్గర పడుతుండటంతో శాఖల కేటాయింపు త్వరలోనే ఉండే అవకాశం ఉంది.

Also Read:బాలయ్య బర్త్ డే..BB4 అనౌన్స్

- Advertisement -