30 మందితో కేంద్ర కేబినెట్?

9
- Advertisement -

ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు నరేంద్ర మోడీ. రాష్ట్రపతి భవన్‌ వేదికగా ఇవాళ సాయంత్రం 7.15 గంటలకు ప్రమాణస్వీకారం చేయనుండగా అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇక మోడీ 3.0లో 30 మంది మంత్రులుగా ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం.

నిబంధనల ప్రకారం కేంద్ర క్యాబినెట్‌లో 78 నుంచి 81 మంది అవకాశం ఉండగా కీలక శాఖలను తనవద్దే ఉంచుకోనుంది బీజేపీ. హోం, ఆర్ధిక, రక్షణ, విదేశీ వ్వవహారాల శాఖలను బీజేపీ అట్టిపెట్టుకుంటుందని తెలుస్తోంది. ఇక ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్న వారిలో ఉక్కు, పౌర విమానయానం, బొగ్గు వంటి కీలకమైన మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖల మంత్రులు ఉంటారని తెలుస్తోంది.

టీడీపీ, జేడీ(యూ)లు కీలక శాఖల కోసం పట్టుబడుతున్నాయి. ఏపీకి 5 కేంద్రమంత్రులు దక్కే అవకాశం ఉండగా జేడీయూ సైతం కీలక శాఖలను డిమాండ్ చేస్తున్నాయి. ప్రధానంగా జేడీయూ స్పీకర్‌ పోస్టును డిమాండ్ చేస్తుండగా ఎవరిని అవకాశం వరిస్తుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Also Read:ది బ‌ర్త్‌డే బాయ్.. టైటిల్ గ్లింప్స్

- Advertisement -