కేంద్ర కేబినెట్‌లో నిర్ణయాలివే

1
- Advertisement -

కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. డీఏపీ ఎరువుపై రైతులకు ఇచ్చే సబ్సిడీని మరింత పెంచాలని నిర్ణయించింది. డీఏపీపై అదనపు భారాన్ని కేంద్రమే భరించనుంది. ఇకపై ఒక 50 కిలోల డీఏపీ బస్తా రూ.1350 కే లభ్యం కానుంది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పలు ముఖ్యమైన ప్రాజెక్టులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

ఫండ్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నాలజీకి కేంద్రం రూ.800 కోట్ల నిధిని ఏర్పాటు చేసింది. అంతేగాక పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన పథకం కింద అందించే మొత్తాన్ని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచాలని నిర్ణయించింది. నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు ఓ ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు చేయాలని కూడా సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది.

Also Read:సీఎం కప్‌ను బహిష్కరించిన కరాటే ఆటగాళ్లు

- Advertisement -