కేంద్ర బడ్జెట్ 2025-26ని ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనుంది మోడీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సంప్రదాయ హల్వా వేడుకను నిర్వహించనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ తయారీ ప్రక్రియలో భాగమైన అధికారులు, సిబ్బంది ఈ వేడుకలో పాల్గొంటారు.
నార్త్ బ్లాక్‌లో ఒక పెద్ద కడాయిలో సిద్ధం చేస్తారు.ఆర్థిక మంత్రి సంప్రదాయబద్ధంగా కడాయి వెలిగించి హల్వా వడ్డిస్తారు. దీంతో బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రారంభానికి నాంది అవుతుంది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయ ప్రాంతంలో వారందరూ గోప్యతను పాటించేందుకు కట్టుబడి ఉంటారు.
1980 నుండి హల్వా వేడుక బడ్జెట్ తయారీ గోప్యతకు ప్రతీకగా నిర్వహించబడుతోంది. ఈసారి నిర్మలా సీతారామన్ తన ఏడవ పూర్తికాల బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Also Read:రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన: జగదీష్ రెడ్డి