కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్.. వచ్చే వారం IT బిల్లు

1
- Advertisement -

కేంద్ర బడ్జెట్ 2025 ప్రవేశపెట్టారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. రైతులను ఆర్థికంగా స్వయంపుష్టంగా చేసేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు నిర్మలా సీతారామన్. భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిని పెంచి, మెట్రో నగరాలకు వలసలు తగ్గించేందుకు సహాయపడుతుందని తెలిపారు. బడ్జెట్‌లో ఆశగా ఎదురుచూసిన వేతన జీవులకు నిరాశే మిగిలింది. వచ్చే వారం నూతన ఆదాయపు బిల్లు ప్రవేశ పెడతామని ఈ బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన ఉండదని తెలిపారు.

యువతకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించేందుకు 5 జాతీయ నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. IITల మౌలిక వసతులను విస్తరిస్తూ, 6,500 మంది విద్యార్థులకు అదనపు సీట్లు కల్పించనున్నారు.వచ్చే ఏడాది నుంచి మెడికల్ కాలేజీల్లో 10,000 అదనపు సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

MSME సెక్టార్‌లో రుణ పరిమితిని పెంచడమే కాకుండా, మహిళలు, అనుసూచిత కులాలు (SC), అనుసూచిత తెగల (ST) కోసం కొత్త రూ.5 లక్షల రుణ పథకం ప్రవేశపెట్టారు.8 కోట్ల మంది పిల్లలు, 1 కోట్ల మంది తల్లులు, 20 లక్షల యువతులకు పోషకాహారం అందించనున్నారు. సౌర PV సెల్స్, ఎలక్ట్రోలైజర్లు, గ్రిడ్-స్థాయి బ్యాటరీల ఉత్పత్తి కోసం కొత్త ఉత్పాదక మిషన్ ప్రారంభించారు.

ప్రస్తుత ప్రభుత్వ నిధులతో పాటు, స్టార్టప్‌ల కోసం అదనంగా రూ.10,000 కోట్ల నిధులను కేటాయించారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు బీహార్‌లో జాతీయ ఆహార సాంకేతిక సంస్థను ఏర్పాటు చేయనున్నారు.22 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, ₹4 లక్షల కోట్ల ఆదాయం, ₹1.1 లక్షల కోట్ల ఎగుమతుల లక్ష్యంతో కొత్త పథకం.

ఇండియా పోస్ట్‌ను ప్రధాన గ్రామీణ లాజిస్టిక్ సంస్థగా అభివృద్ధి చేసేందుకు తగిన మార్పులు చేయనున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి పెంపు – రైతులకు రుణసదుపాయాన్ని మెరుగుపరిచేందుకు కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని రూ.3 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచారు. అస్సాంలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఉరియా ప్లాంట్ ఏర్పాటు.

Also Read:Budget 2025:కొత్తగా ధన్ ధాన్య యోజనా పథకం

ఈ బడ్జెట్‌లో గరీబులు (పేదలు), యువత, అన్నదాతలు (రైతులు), నారి (మహిళలు) వంటి 10 విభాగాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చర్యలు ప్రకటించారు.
సబ్‌కా వికాస్ లక్ష్యం – గత 10 ఏళ్ల అభివృద్ధి మరియు నిర్మాణాత్మక సంస్కరణలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. తదుపరి 5 సంవత్సరాల్లో సమతుల అభివృద్ధిని సాధించేందుకు ఇది విశిష్ట అవకాశం,” అని నిర్మలా సీతారామన్ చెప్పారు.

 

 

 

 

- Advertisement -