కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుడికి గట్టి షాకిచ్చింది. పెట్రో ధరలపై సెస్ విధించడంతో ధరలు మరింత పెరిగి సెంచరీ దాటే అవకాశం ఉంది. అయితే బడ్జెట్‌లో త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలైన తమిళనాడు,కేరళ,పశ్చిమ బెంగాల్,అసోంలపై వరాల జల్లు కురిపించింది కేంద్రం.
కొచ్చిమెట్రో రైల్ ఫేజ్ 2 కోసం రూ.1957 కోట్లు,చెన్నై మెట్రో రైల్ ఫేజ్ – 2 కోసం రూ. 5300 కోట్లు కేటాయించగా బీజేపీ అధికారంలో ఉన్న బెంగళూరు మెట్రో రైల్ ఫేజ్ -2 కోసం రూ.14,788 కోట్లు,నాగపూర్ మెట్రో రైల్ ఫేజ్ – 2 కోసం రూ.5976 కోట్లు కేటాయించింది.
తమిళనాడు రోడ్ల కోసం లక్ష కోట్లు కేటాయించింది. కేరళలో 55 వేల కోట్లు,అస్సాంలో 34 వేల కోట్లు ,బెంగాల్‌లో 24 వేల కోట్లు రోడ్డు ప్రాజెక్టుల కోసం కేటాయించారు. దీంతో ఇది పూర్తిగా ఎన్నికల బడ్జెట్‌గా మారిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేసి మిగితా రాష్ట్రాలకు మొండిచేయి చూపించారని మండిపడుతున్నారు.