రైల్వేల అభివృద్ధికి రూ.1.48లక్షల కోట్లు కేటాయించినట్లు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన జైట్లీ 600 మేజర్ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ చేపట్టమాన్నారు. ముంబై లోకల్ రైళ్ల కోసం రూ. 11 వేల కోట్లు, బెంగళూరు మెట్రో రైలుకు రూ. 17 వేల కోట్లు కేటాయించామన్నారు. విశాఖ రైల్వే జోన్ అంశాన్ని ప్రస్తావించలేదు జైట్లీ.
కొత్త రైల్వే లైన్లపై ప్రత్యేక దృష్టి సారించామని… అన్ని రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై ఏర్పాటుచేస్తామన్నారు. 4 వేల కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్‌ల నిర్మాణం చేపడతామన్నారు.అహ్మదాబాద్,ముంబై హైస్పీడ్ రైలుకు శంకుస్ధాపన చేశామని తెలిపారు.సబర్బన్ రైల్వే పనులకు రూ 40 వేల కోట్లు…అన్ని రైల్వే స్టేషన్లలో ఎక్సలేటర్లు ఏర్పాటుచేస్తామన్నారు. కాపాలాదారులు లేని 4,320 రైల్వే గేట్లు మూసివేస్తామన్నారు.
రూ.3073 కోట్లతో డిజిటల్ ఇండియా పథకానికి కేటాయించామన్నారు. సామాన్యుడికి అందుబాటులో ఉండేలా విమానాయానాన్ని విస్తరిస్తమన్నారు. 900 కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చామని…. ఐటీ స్కానర్ పరిధిలో బిట్ కాయిన్ అంశం ఉందన్నారు. కొత్తగా 10 పర్యాట స్ధలాల ఎంపికచేశామన్నారు.
ఇంటింటి తాగునీటి పథకానికి రూ.77,500కోట్లు,రోడ్లు, మౌలిక వసతులకు రూ.9.64లక్షల కోట్లు,కొత్త ఉద్యోగాలు కల్పించే రంగాల్లో ప్రభుత్వం చెల్లించే ఈపీఎఫ్ 8.33శాతం నుంచి 12శాతానికి పెంచినట్లు తెలిపారు.పెంచిన ఈపీఎఫ్ మూడేళ్ల పాటు అమల్లోఉంటుందన్నారు. సరిహద్దుల్లో మౌలిక సౌకర్యాలకు ప్రాధాన్యత,టెక్స్‌టైల్ రంగానికి రూ.7,140కోట్లు,జన్‌ధన్ యోజనలో భాగంగా 60వేల కోట్ల బ్యాంకు ఖాతాలకు బీమా సౌకర్యం వర్తింపు చేస్తున్నామన్నారు.