ఆరోగ్య భారత్..అభివృద్ధి భారత్

170
union budget 2018
- Advertisement -

2022 నాటికి దేశంలోని పేదలందరికీ ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు అరుణ్ జైట్లీ. లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన జైట్లీ…ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకంతో పేదలకు చేయూతనందిస్తున్నామని చెప్పారు. ఈ-నామ్‌తో అన్నదాతలకు లాభం చేకూరిందని చెప్పారు. గృహ విద్యుత్ కోసం రూ. 16 వేల కోట్లతో ప్రధానమంత్రి సౌభాగ్య యోజన పథకం తీసుకొచ్చామన్నారు. ఆపరేషన్ గ్రీన్‌కు రూ. 500 కోట్లకు కేటాయించామని చెప్పారు.

రైతులకు కనీసం 50 శాతం లాభాలు వచ్చేలా చర్యలు చేపడతున్నామన్నారు. 11 లక్షల కోట్లతో వ్యవసాయ రుణాలు ఇస్తున్నామని చెప్పారు. ఉజ్వల యోజన పథకంతో 5 కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూరిందన్నారు. కౌలు రైతులకు రుణాలుఇచ్చేలా కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నామని చెప్పారు.

సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. స్వచ్ఛ మిషన్‌లో భాగంగా 6 లక్షల మరుగుదోడ్లను నిర్మించామని ఈ ఏడాది మరో 2 కోట్ల ప్రభుత్వ టాయ్‌లెట్‌లను నిర్మిస్తామన్నారు.. ఆరోగ్యం,విద్య,సామాజిక భద్రతకు పెద్దపీట వేశామన్నారు. పశుసంవర్ధక శాఖకు రూ. 10 వేల కోట్లు కేటాయించామన్నారు. ఆలు,టమాట,ఉల్లిగడ్డ కోసం రూ. 500 కోట్లు కేటాయించామన్నారు. గ్రామీణ వ్యవసాయ మార్కెట్లకు రూ. 2 వేల కోట్లు,సాంఘీక భద్రతకు రూ.975 కోట్లు కేటాయించామన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య స్కూళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు.

నాబార్డు నుంచి సాగునీటి ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. వడోదరాలో రైల్వే యూనివర్సిటీ, విద్యా పరిశోధనకు రూ. లక్ష కోట్లు కేటాయించామన్నారు. ఉజ్వల పథకం కింద 8 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కలెక్షన్లు అందించామన్నారు.ఆరోగ్య భారత్..అభివృద్ధి భారత్ లక్ష్యమన్నారు.

- Advertisement -