థ్రిల్లింగ్..ఇదో వింత ఔట్!

82
eng vs newzealand
- Advertisement -

క్రికెట్‌లో అద్బుతాలు జ‌ర‌గ‌డం కొత్తేమీ కాదు. కొన్నిసార్లు ఆ అద్భుతాలు బ్యాట్స్‌మెన్, బౌల‌ర్‌కి ఫేవ‌ర్‌గా ఉంటే, మ‌రికొన్ని మాత్రం త‌మ‌కు సంబంధం లేకుండానే బాధ్యులు కావాల్సి వ‌స్తుంది.

తాజాగా ఇలాంటి సంఘ‌ట‌నే ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మ‌ధ్య జ‌రుగుతున్న మూడో టెస్టులో జ‌రిగింది. కివీస్ బ్యాట‌ర్ నికోల్స్ అనూహ్య రీతిలో ఔట‌య్యారు. స్పిన్న‌ర్ జాక్ లీచ్ బౌలింగ్‌లో నికోల్స్ భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించాడు. అయితే ఆ బంతి నాన్ స్ట్ర‌యికర్ డారెల్ మిచెల్ బ్యాట్ త‌గిలి గాలిలోకి ఎగిరింది. బ్యాట్‌కు త‌గిలిన త‌ర్వాత అంపైర్ మీదుగా వెళ్తూ ఆ బంతి కాస్త మిడ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అలెక్స్ లీస్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో నికోల్స్ ఊహించ‌ని రీతిలో నిష్క్ర‌మించాడు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

- Advertisement -