‘సర్కారు వారి పాట’ నుండి మహేష్‌ న్యూ లుక్‌..

140
- Advertisement -

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు ప్రస్తుతం నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. పరశురాం దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో మహేష్‌ బాబు సరసన కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర యూనిట్ మహేష్‌ కొత్త లుక్‌ను విడుదల చేసింది. గత చిత్రాలకు భిన్నంగా మహేష్‌ కొత్త హెయిర్ స్టయిల్‌తో ఈ చిత్రంలో కనువిందు చేయనున్నాడని తాజా పిక్ చెబుతోంది.

ఈ మేరకు మహేష్‌ బాబు స్పందిస్తూ.. సరికొత్త యాక్షన్, ఎంటర్టయిన్ మెంట్‌తో వచ్చేస్తున్నాం… సంక్రాంతికి కలుద్దాం అంటూ ట్వీట్ చేశారు. ఇక “సూపర్ స్టార్ మహేష్‌ బాబు వచ్చేశాడు… సర్కారు వారి పాట నుంచి ఫస్ట్ నోటీస్ వచ్చేసింది” అంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పోస్టు చేసింది. దాంతోపాటే, మహేష్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఆగస్టు 9న సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ ఉంటుందని అభిమానులకు తీపి కబురు చెప్పింది. ఇక ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వరి 13న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

- Advertisement -