జూన్ 23న `ఉండిపోరాదే ` ఆడియో విడుద‌ల‌

533
Undiporade
- Advertisement -

గోల్డ్ టైమ్ ఇన్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై త‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా న‌వీన్ నాయ‌ని ద‌ర్శ‌క‌త్వంలో డా.లింగేశ్వ‌ర్ నిర్మిస్తోన్న చిత్రం `ఉండిపోరాదే`. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌రవేగంగా జ‌రుపుకుంటోంది. తెలుగు లో ఈ నెల 23న విడుద‌ల చేయ‌టానికి నిర్మాత డా,లింగేశ్వ‌ర్ గారు స‌న్నాహ‌లు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నికార్య‌క్ర‌మాలు పూర్తిచేసి జులై నెలాఖ‌రుకి విడుద‌ల చేయ‌టానికి ప్లాన్ చేస్తున్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు స‌బు వ‌ర్గీస్ మాట్లాడుతూ…“ఇందులో ప్ర‌తి పాట సంద‌ర్భానుసారంగా సాగేదే. ద‌ర్శ‌క నిర్మాత‌లు పూర్తి స్వేచ్ఛ‌నివ్వ‌డంతో మంచి పాట‌లు ఇవ్వ‌గ‌లిగాను` ఈ ఆడియో ని జూన్ 23న విడుద‌ల చేయ‌టానికి మా నిర్మాత డా.లింగేశ్వ‌ర్ గారు స‌న్నాహ‌లు చేస్తున్నారు` అన్నారు.

ద‌ర్శ‌కుడు న‌వీన్ నాయని మాట్లాడుతూ…“న‌న్ను న‌మ్మి డైర‌క్ట‌ర్ గా అవ‌కాశం ఇచ్చిన మా నిర్మాత‌కు లైఫ్ లాంగ్ రుణ‌ప‌డి ఉంటాను. ఇదొక రియ‌లిస్టిక్ స్టోరి. ప‌క్కింటి అమ్మాయి జీవితం చూసిన‌ట్టుగా సినిమా ఉంటుంది. ముఖ్యంగా తండ్రీ కూతుళ్ల మ‌ధ్య సాగే ఎమోష‌నల్ గా, మ‌న‌సులు క‌దిలించే సాంగ్ వుంది. ఇటీవ‌లే క‌న్న‌డ లో మా ఆడియో విడుద‌ల‌య్యింది. కేదార్ శంక‌ర్‌, అజ‌య్ ఘోష్ ల పాత్ర‌లు సినిమాకు హైలెట్ గా ఉంటాయి. మా ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారని ఆశిస్తున్నా“ అన్నారు.

- Advertisement -