టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్..

120
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ లో భాగంగా కీలక మ్యాచ్‌ జరగనుంది. లక్నో సూపర్ జెయింట్స్- పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ సారధి మయాంక్ అగర్వాల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తమ జట్టులో ఎలాంటి మార్పులూ లేవని మయాంక్ తెలిపాడు. అదే సమయంలో తమ జట్టులో మనీష్ పాండే స్థానంలో ఆవేష్ ఖాన్ ఆడుతున్నట్లు రాహుల్ వెల్లడించాడు.

ఈ మ్యాచ్ లో హాట్ ఫేవరెట్ గా లక్నో సూపర్ జెయింట్స్ బరిలోకి దిగనుంది. కొత్త జట్టే అయినా లక్నో వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ వైపుకు దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్ లు ఆడిన లక్నో 5 విజయాలు మూడు పరజయాలతో 10 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ కథ మాత్రం మరోలా ఉంది. నిలకడ లేకుండా సీజన్ లో తమ ప్రయాణాన్ని సాగిస్తోంది. ఆడిన 8 మ్యాచ్ ల్లో 4 విజయాలు నాలుగు పరాజయాలతో 8 పాయింట్లతో పాయింట్ల పట్టకిలో ఏడో స్థానంలో ఉంది.

తుది జట్లు..

లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డీకాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), మార్కస్ స్టొయినిస్, కృనాల్ పాండ్యా, దీపక్ హుడా, ఆయుష్ బదోనీ, జేసన్ హోల్డర్, దుష్మంత చమీర, రవి బిష్ణోయి, మొహ్‌సిన్ ఖాన్, ఆవేష్ ఖాన్

పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టన్, జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ, రిషి ధావన్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్, సందీప్ శర్మ.

- Advertisement -