అంపైర్ అసద్ రవూఫ్ కన్నుమూత..

97
rauf
- Advertisement -

దిగ్గజ అంపైర్ అసద్ రవూఫ్ ఇకలేరు. లాహెర్‌లో గుండెపోటుతో ఆయన మృతిచెందారు. వెంటనే ఆయన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది.పాకిస్థాన్‌కు చెందిన దిగ్గజ అంపైర్లలో రవూఫ్ ఒకరు. 2006లో ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్స్ జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు.

47టెస్టులు, 98 వన్డేలు, 23 అంతర్జాతీయ టీ20ల్లో ఆయన అంపైర్‌గా వ్యవహరించారు. 1998లో అంపైర్‌గా ప్రస్థానం ప్రారంభించిన రవూఫ్.. 2000లో పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ స్థాయిలో అంపైర్‌గా అరంగేట్రం చేశారు. 2004లో తొలిసారిగా ఇంటర్నేషనల్ అంపైర్స్ ప్యానెల్‌లో ఆయన చోటు దక్కించుకున్నారు.

2013 స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో రవూఫ్ పేరు తెర మీదకు రావడంతో ఆయన ప్రభ మసకబారింది. అదే ఏడాది ఐసీసీ ఆయన్ను ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్స్ జాబితా నుంచి తొలగించింది.

- Advertisement -