- Advertisement -
గురువారం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ఆయన అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలో ఆయన కాసేపు గడిపి మహాత్మాగాంధీ వాడిన చరఖాతిప్పి నూలు వడికారు. చరఖాను ఎలా తిప్పాలో ఆశ్రమంలోని మహిళలు ఆయనకు వివరించారు.
విజిటర్స్ పుస్తకంలో ఆయన తన అనుభవాన్ని రాశారు. సబర్మతీ ఆశ్రమానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ప్రపంచాన్ని మార్చడానికి మహాత్మా గాంధీ సత్యం, అహింస వంటి సాధారణ సూత్రాలతో ఎలా పోరాడారో తాను అర్థం చేసుకున్నానని చెప్పారు. గాంధీ రాసిన గైడ్ టు లండన్ అనే పుస్తకాన్ని బోరిస్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు.
- Advertisement -