గ్రామాల అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నాం: ఎర్రబెల్లి

160
errabelli
- Advertisement -

గ్రామాల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఎర్రబెల్లి… రని పేర్కొన్నారు. స్థానికంగా పల్లె ప్రకృతి వనాన్ని, వైకుంఠధామాన్ని, దాతల సహకారంతో అందుబాటులోకి తెచ్చిన పరమపద వాహనాన్ని ప్రారంభించి మాట్లాడారు.

గ్రామాల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ ఎజెండా అని స్పష్టం చేశారు. పంచాయతీలకు నెలనెలా రూ.308 కోట్లు విడుదల చేస్తున్నామని….. రైతుబంధు, రైతు బీమా, సాగుకు నిరంతర ఉచిత విద్యుత్‌ ఇచ్చి అన్నదాతల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగు నింపారని అన్నారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు కొనసాగించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శమని, కేంద్ర వ్యవసాయ చట్టాలు రైతులను నట్టేట ముంచేలా ఉన్నాయని ఆక్షేపించారు.

- Advertisement -