బ్రిటన్ ప్రధాని భారత పర్యటన రద్దు..

245
borris-johnson
- Advertisement -

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ 26న రిపబ్లిక్ డే వేడుకలకు హాజరుకానున్న విషయం తెలిసిందే. అయితే ఆయన తాజాగా భారత పర్యటనను వాయిదా వేసుకున్నారు. దేశంలో కరోనా వైరస్‌ న్యూ స్ట్రెయిన్‌ ప్రభావంతో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిన నేపథ్యంలోనే బోరిస్‌ జాన్సన్‌ తన భారత పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తున్నది.

కాగా ప్రతిఏటా జనవరి 26వ తేదీన భారత్‌ రిపబ్లిక్ డే వేడుకలకు ఒక విదేశీ అదినేతను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తున్నది. అందులో భాగంగానే ఈ ఏడాది రిపబ్లిక్‌ డే దినోత్సవాలకు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను ముఖ్య అతిథిగా హాజరు కావాలని భారత ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానించారు.

- Advertisement -