బ్రిటన్ దేశాన్ని సుదీర్ఘకాలంగా పీడిస్తున్న ‘గ్రూమింగ్ గ్యాంగ్స్’ (బాలికలను లొంగదీసుకుని అత్యాచారాలు చేసే ముఠాలు) దారుణాలపై ఆ దేశ ఎంపీ రూపెర్ట్ లోవ్ పార్లమెంట్‌లో సంచలన ప్రసంగం చేశారు. స్వతంత్ర విచారణ కమిటీ ముందు బాధితులు వెల్లడించిన అత్యంత భయంకరమైన సాక్ష్యాలను ఆయన సభలో చదివి వినిపించారు.
బ్రిటన్ వ్యాప్తంగా కనీసం 85 ప్రాంతాలలో ఇటువంటి గ్యాంగ్‌లు క్రియాశీలంగా ఉన్నాయని ఇందులో ప్రధానంగా పాకిస్తానీ సంతతికి చెందిన పురుషులు దశాబ్దాలుగా వ్యవస్థీకృత లైంగిక దాడులకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. బాధితుల సాక్ష్యాల ప్రకారం.. 12-13 ఏళ్ల చిన్న వయసు నుంచే బాలికలపై దారుణంగా అత్యాచారాలు, శారీరక హింస జరిగాయి. ఒక బాధితురాలు తాను మూడేళ్ల కాలంలో దాదాపు 600 నుండి 700 మంది పురుషుల చేతిలో అత్యాచారానికి గురయ్యానని పేర్కొంది.
నేరగాళ్లు బాధితుల క్రైస్తవ మతాన్ని, జాతిని అవమానిస్తూ మానసికంగా కుంగదీశారని, రంజాన్ (ఈద్) పండుగలు మరియు సెలవు దినాల్లో ఈ ఘోరాలు మరింత పెరిగేవని వెల్లడైంది. 5 నుండి 20 మంది మహిళలను బోనుల్లో బంధించి ఉంచడాన్ని తాను చూశానని,…అలాగే మూగజీవాలతో కూడా దారుణంగా అత్యాచారం చేయించి వీడియోలు తీశారని ఒక బాధితురాలు కన్నీటిపర్యంతమైంది. ఈ దారుణాల్లో కొందరు పోలీసు అధికారులు కూడా పాల్గొన్నట్లు బాధితులు ఆరోపించడం గమనార్హం.
తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రికి వెళ్లినప్పటికీ అక్కడి వైద్య సిబ్బంది ఎటువంటి ప్రశ్నలు అడగకుండా కేవలం టాబ్లెట్లు ఇచ్చి పంపేసి తమ బాధ్యతను విస్మరించారని 15 ఏళ్ల ఒక బాధితురాలు పేర్కొంది. ఇలా ప్రభుత్వ అధికారులు, సామాజిక సంస్థలు, పోలీసులు తీవ్రంగా విఫలమవడం వల్లే ఈ నేరాలు ఇన్నాళ్లు సాగాయని ఎంపీ లోవ్ మండిపడ్డారు. 2002 నుండి బ్రిటన్ రాజకీయాల్లో నలుగుతున్న ఈ ‘గ్రూమింగ్ గ్యాంగ్స్’ సంస్కృతిపై ఇకనైనా చర్చలు ఆపి…ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలోనే రాబోయే తమ పూర్తి విచారణ నివేదిక బ్రిటన్ భవిష్యత్తును మారుస్తుందని రూపెర్ట్ లోవ్ స్పష్టం చేశారు.
Also Read:ఇది రాచరికం కాదు..రబ్రీపై సీఎం!

