ట్రంప్‌పై దాడి..రీక్రియేట్ చేసిన ఉగాండా చిన్నారులు

23
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డోనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో ప్రాణాలతో బయటపడ్డారు ట్రంప్. చెవికి గాయం కాగా ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ట్రంప్.

ఇక ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నాన్ని రీక్రియేట్ చేశారు ఉగాండా చిన్నారులు. చెక్క రైఫిళ్లు, ప్లాస్టిక్ వ‌స్తువులను ఇందుకోసం వాడగా ఈ వీడియో వైరల్‌గా మారింది. పోడియంపై మాట్లాడుతున్న స‌మ‌యంలో బుల్లెట్ త‌గ‌ల‌గానే, చిన్నారితో పాటు అక్క‌డ ఉన్న సెక్యూర్టీ కింద దాక్కున్న‌ట్లు చిత్రీక‌రించారు ట్రంప్ త‌న పిడికిలి బిగించి పోరాడుతాం అన్న డైలాగ్ కొట్టిన స్ట‌యిల్‌లోనే పిల్ల‌వాడు అరిచాడు. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ రావడం విశేషం.

Also Read:BMSలో ప్రభాస్ ఆల్-టైమ్ రికార్డ్

- Advertisement -