- Advertisement -
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ జివిత చరిత్రపై బయోపిక్ తెరకెక్కుతుంది. ఉద్యమసింహం టైటిల్ పేరుతో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈమూవీ ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. నటరాజన్, పీఆర్ విటల్ బాబు, సూర్యలు ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రానికి అల్లూరి కృష్ణం రాజు దర్శకత్వం వహించగా, దీలీప్ బండారి సంగీతాన్ని సమకూర్చారు.
ఈమూవీని పద్మనాయకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కల్వకుంట్ల నాగేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈమూవీలో కేసీఆర్ ఉద్యమ ప్రస్ధానం, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన పడ్డ ఇబ్బందులు, అమరణ నిరాహార దీక్ష పలు అంశాలను చూపించనున్నారు. మార్చి 29న ఈసినిమాను విడుదల చేయనున్నాట్ఉల తెలిపారు చిత్రయూనిట్.
- Advertisement -