డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్…నెట్టింట్లో వైరల్!

39
udhayanidhi stalin

తమిళనాట తిరుగులేని విజయాన్ని సాధించింది డీఎంకే. స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే భారీ విజయాన్ని నమోదుచేసుకోగా తొలిసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు స్టాలిన్. ఇక ఈ ఎన్నికల్లో స్టాలిన్ వారసుడిగా బరిలోకి దిగిన ఉదయనిధి స్టాలిన్ ఘన విజయాన్ని నమోదుచేసుకున్నారు. తన తాత ప్రాతినిధ్యం వహించిన చెపాక్ నుండి దాదాపు 60 వేల మెజార్టీతో విజయం సాధించారు.

ఉదయనిధి స్టాలిన్ విజయంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటుండగా అభిమానులు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

సినీ నిర్మాతగా, నటుడిగా తన కంటూ ప్రత్కేక గుర్తింపు కలిగిన ఉదయనిధిని ప్రచారంలోనూ తనదైన శైలీలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ప్రజలను ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధించారు. ఈ నెల 6న సీఎంగా స్టాలిన్‌ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.