ఇకపై సినిమాలు చేయను:ఉదయనిధి స్టాలిన్

104
udhayanidhi stalin
- Advertisement -

సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్. ఆయన నటించిన నెంజుకు నిధి ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుండగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు.

ఈ చిత్రం విడుద‌ల కాకముందే మారీ సెల్వ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో మామ‌న్న‌న్ అనే సినిమాను చేస్తున్నాడు. ప్ర‌స్తుతం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఇదే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రం తనకి ఆఖ‌రి చిత్రం అని…ఇటు సినిమాలు అటు రాజ‌కీయాలు బ్యాలెన్స్ చేయ‌లేక‌పోవ‌డం వ‌ల్లే ఈ నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లు తెలిపారు.

ఉద‌య‌నిధి త‌మిళ‌నాడులో జ‌రిగిన గ‌త ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే.

- Advertisement -