- Advertisement -
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం తారాస్ధాయికి చేరింది. ఇవాళ రెబల్ ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించనుండగా దీనిపై స్పందించారు ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్. సీఎం ఉద్ధవ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేయరని, శివసేనకు రెబెల్ ఎమ్మెల్యేలు చేసిన ద్రోహాన్ని ప్రజల్లో ఎండగడతామన్నారు.
పార్టీ కోసం తాము రక్తం, స్వేదం చిందించామని శివసేను ఎవరూ దెబ్బతీయలేరని అన్నారు. శివసైనికులు వీధుల్లోకి వస్తే అగ్గిరాజుకుంటుందని హెచ్చరించారు.మరోవైపు రెబెల్ ఎమ్మెల్యేల ఇండ్లు, కార్యాలయాలపై దాడులు చేపట్టారు శివసేన కార్యకర్తలు.
రెబెల్ ఎమ్మెల్యేలకు భద్రతను సీఎం, హోం మంత్రి ఉపసంహరించారని ఆరోపణలు వస్తుండగా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేలకు భద్రతను ఉపసంహరించాలని సీఎం లేదా హోం శాఖ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని చెప్పారు.
- Advertisement -