ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే ప్రమాణస్వీకారం..

654
Uddhav Thackeray
- Advertisement -

మహారాష్ట్ర కొత్త సీఎంగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు సాయంత్రం ముంబైలోని శివాజి పార్కు లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ ఉద్ధవ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు.  ప్రమాణస్వీకారానికి ముందు ఛత్రపతి శివాజీ విగ్రహానికి నమస్కరించారు ఉద్దవ్. శివసేన కార్యకర్తలు, అభిమానులు తదితర నేతలు హర్ష ద్వానాల మధ్య ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమానికి మహా వికాస్ అఘాడీ కూటమిలోని పార్టీల ప్రముఖులతో పాటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సహా సుమారు 400 మంది రైతులను కూడా ఉధ్ధవ్ ప్రమాణ స్వీకారానికి విచ్చేశారు. ఇరవై ఏళ్ళ తరువాత శివసేనకు చెందిన నేత (ఉద్దవ్ థాకరే) మహారాష్ట్రకు 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం విశేషం. ఈ సందర్భంగా ఉద్ధవ్‌ను గవర్నర్ అభినందించారు.

CM Uddhav Thackeray

ఇక ఉధ్ధవ్ థాకరేతో బాటు ప్రతిపార్టీ నుంచి ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురు మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు. శివసేనకు చెందిన ఏక్ నాథ్ షిండే, సుభాష్ దేశాయ్, ఎన్సీపీ నేత జయంత్ పాటిల్, ఛగన్ భుజ్ బల్, కాంగ్రెస్ పార్టీ నుంచి బాలాసాహెబ్ థోరట్, అశోక్ చవాన్ మంత్రులుగా ప్రమాణం చేశారు.43 మంత్రివర్గ శాఖల్లో శివసేన 16, ఎన్సీపీ 15, కాంగ్రెస్ పార్టీకి 12 పదవులు దక్కనున్నాయి. కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ పదవి దక్కుతుందని సమాచారం. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ మళ్ళీ పదవి పొందనున్నారు.

- Advertisement -