- Advertisement -
మహారాష్ట్ర శాసనమండలికి సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019 నవంబర్ 28న మహారాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు ఉద్దవ్ ఠాక్రే. ఆరు నెలల పాటు ఎలాంటి పదవి లేకుండా సీఎంగా కొనసాగే ఛాన్స్ ఉండటంతో ఎలాంటి ప్రత్యక్ష ఎన్నికల్లోనూ పోటీచేయండా సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. మే 27తో గడువు ఉద్దవ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసే గడువు ముగుస్తుండటంతో అందరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే గవర్నర్ నిర్ణయంతో మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది.
9 స్ధానాలకు నోటిఫికేషన్ వెలువడగా తొమ్మిది నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. దీంతో సీఎం ఉద్ధవ్‌తో పాటు మరో ఎనమిదిమంది ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలో శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే.
- Advertisement -