పవన్ సినిమాలో ఉదయభాను..!

205
pawan kalyan udayabhanu
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను 2018 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు ఘనవిజయం సాధించటంతో కొత్త సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం సీనియర్ యాంకర్ ను తీసుకున్నారట.

TV-Anchor-Udaya-Bhanu-Item-Song-in--Pawan-Kalyan-and-Trivikram-Srinivas-film

గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన జులాయి సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించిన ఉదయభాను, పవన్ సినిమాలోనూ ఐటమ్ సాంగ్ లో మెరవనుందన్న టాక్ వినిపిస్తోంది. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తోన్న ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ కథానాయికలు, కీలక పాత్రల్లో ఖుష్బూ, బోమన్ ఇరానీ, రావు రమేష్, సంపత్ రాజ్ కనిపించనున్నారు అనిరుధ్ సంగీతాన్నందిస్తున్న ఈ చిత్రంలో ఉదయభాను ఐటమ్ సాంగ్ అదనపు ఆకర్షణ కాబోతుందట.కవల పిల్లలకు తల్లైన తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఉదయభాను మళ్లీ యాంకరింగ్ మొదలుపెట్టింది. త్వరలో ఉదయభాను‌పై ఈ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరిస్తారట.

- Advertisement -