‘దీపావళి’ శుభాకాంక్షలు : రవితేజ

201
raja-the-great-
- Advertisement -

దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అన్ని దేవాలయాలు కిటకిటలాడుతుండగా, అన్నిచోట్ల భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ దసరాకు ‘రాజా ది గ్రేట్‌’ టీం వినూత్నంగా శుభాకాంక్షలను తెలిపింది. రవితేజ, మెహ్రీన్‌, రాజేంద్రప్రసాద్‌, శ్రీనివాస్‌ రెడ్డిలతో ఒక వీడియోను చేసిన చిత్ర యూనిట్‌ అందరికీ శుభాకాంక్షలను తెలిపింది.

ఆ వీడియోలో ‘అందరికీ దసరా శుభాకాంక్షలు’ అని రాజేంద్రప్రసాద్‌ చెబుతుండగా ‘దీపావళి శుభాకాంక్ష’లంటూ రవితేజ అంటాడు. ‘నేను దసరా శుభాకాంక్షలు చెబితే వీడు దీపావళి అంటాడేమిటి’ అని రాజేంద్ర ప్రసాద్‌ ప్రశ్నించగా, ‘మన సినిమా రిలీజ్‌ అయ్యేది దీపావళికేగా’ అంటాడు రవితేజ. ‘అప్పుడు ముందు దసరాకు చెప్పి తర్వాత దీపావళి చెప్పొచ్చుగా’ అని రాజేంద్రప్రసాద్‌ అంటాడు. ఇలా వినూత్నంగా ఆకట్టుకునేలా ఈ వీడియోను దర్శకుడు రూపొందించి టీజర్ లా విడుదల చేశాడు. ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది.

- Advertisement -