యుద్ధంపై తప్పుడు ప్రచారం..కఠిన చర్యలు

1
- Advertisement -

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఇరాన్-యుఎస్-ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో తప్పుడు సమాచారం వ్యాప్తిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే పోస్టులు పెట్టినందుకు 19 మంది భారతీయులపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

అధికారుల వివరాల ప్రకారం, మొత్తం 35 మందిని అరెస్ట్ చేయాలని యూఏఈ అధికారులు ఆదేశించారు. వీరిలో 19 మంది భారతీయులు ఉన్నారు. యుద్ధ పరిస్థితులపై తప్పుడు లేదా మార్పులు చేసిన వీడియోలు, పోస్టులు సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పోస్టులు ప్రజల్లో భయాందోళనలు కలిగించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

దర్యాప్తులో ఈ నిందితులు మూడు వర్గాలుగా పనిచేసినట్లు గుర్తించారు. కొందరు వాస్తవ ఘటనలకు సంబంధించిన వీడియోలను తప్పుగా చూపిస్తూ పోస్ట్ చేశారు. మరికొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో నకిలీ వీడియోలు రూపొందించి ప్రచారం చేశారు. మరో వర్గం యుద్ధంలో పాల్గొంటున్న దేశాల సైనిక చర్యలను ప్రోత్సహించే విధంగా ప్రచారం చేసినట్లు తెలుస్తోంది.

Also Read:2027 వరల్డ్ కప్‌ గెలవడమే టార్గెట్!

ఈ చర్యలు దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నవని యూఏఈ అధికారులు తెలిపారు. యుద్ధ పరిస్థితుల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి అయితే ప్రజల్లో గందరగోళం, భయాందోళనలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే సోషల్ మీడియాను కఠినంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

నిందితులను త్వరితగతిన కోర్టులో హాజరుపరచి విచారణ జరపనున్నట్లు యూఏఈ అధికారులు వెల్లడించారు.

- Advertisement -