Megastar:చిరంజీవికి అరుదైన గౌరవం

23
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) నుంచి గోల్డెన్‌ వీసా అందుకున్నారు. రీసెంట్‌గా సూపర్ స్టార్ రజనీకాంత్‌కు గోల్డెన్ వీసా ఇచ్చిన యూఏఈ…తాజాగా చిరుకు ఈ వీసాను అందించింది. దీంతో అంతా చిరుకు విషెస్‌ చెబుతున్నారు.

పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, నటులు, సాహిత్యం, క‌ల్చర్‌, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేటర్లు.. ఇలా వివిధ రంగాలకు చెందిన వారికి 10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది. ఈ వీసా పొందిన వారు ఎలాంటి ఆంక్షలు లేకుండా యూఏఈలో దీర్ఘకాలికంగా నివ‌సించే వీలు ఉంటుంది.

సినిమా రంగం నుండి షారుఖ్‌ఖాన్, సంజ‌య్ ద‌త్‌, సునీల్ శెట్టి, మౌనీ రాయ్‌, ఫ‌రా ఖాన్‌, బోనీ క‌పూర్ ఫ్యామిలీ , నేహా క‌క్కర్‌, సింగ‌ర్ సోనూ నిగ‌మ్ ,త్రిష ,అమ‌లాపాల్ ,మోహ‌న్ లాల్‌, మ‌మ్ముట్టి, టోవినో థామ‌స్‌, దుల్కర్ స‌ల్మాన్ ,ఉపాస‌న ,అల్లు అర్జున్‌కు కూడా ఈ వీసా వరించింది.

Also Read:బాస‌ర ట్రిపుల్ ఐటీ..నోటిఫికేష‌న్ రిలీజ్

- Advertisement -