‘యు ట‌ర్న్’ మూవీ రివ్యూ..

269
U Turn Telugu Movie Review
- Advertisement -

స‌మంత ఈ యేడాది ఇప్ప‌టికే ‘రంగ‌స్థ‌లం’, ‘మ‌హాన‌టి’, ‘అభిమ‌న్యుడు’ చిత్రాల‌తో విజ‌యాల్ని సొంతం చేసుకొని త‌న జోరును కొన‌సాగిస్తోంది . తాజాగా ఈ అక్కినేని వారి కోడ‌లు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యూ టర్న్’. పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వినాయకచవితి రోజు సందర్భంగా తెలుగు , తమిళ భాషల్లో ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో చూద్దాం!

కథ: రచన (సమంత) టైమ్స్ ఆఫ్ ఇండియాలో రిపోర్టర్ గా వర్క్ చేస్తుంటుంది. ఈ క్రమంలో ఆర్కేపురం ఫ్లై ఓవర్ పై జరిగే యాక్సిడెంట్లకు సంబంధించి ఓ కథ రాయాలనుకుంటుంది. అందుకోసం ఆర్కే పురం ఫ్లై ఓవ‌ర్ యూ ట‌ర్న్ తీసుకొనే వాహ‌న‌దారుల్ని ఎంచుకుంటుంది. వాళ్ల వాహ‌నాల నంబ‌ర్ల ఆధారంగా చిరునామా, ఫోన్ నెంబ‌ర్లు తెలుసుకొనే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది. అందులో సుంద‌రం నెంబ‌రు చిరునామా ఒక‌టి. అత‌న్ని ఇంటర్వ్యూ చేయ‌డం కోస‌మ‌ని ఇంటికి వెళుతుంది? తీరా ర‌చ‌న ఆయ‌న ఇంటికి వెళ్లేస‌రికి సుంద‌రం నిర్జీవంగా క‌నిపిస్తాడు. దాంతో పోలీసులు ర‌చ‌ననే అనుమానిస్తూ విచార‌ణ‌కి పిలుస్తారు. ఆ క్ర‌మంలో ఒక డైరీ దొరుకుతుంది పోలీసులకి. సుంద‌రం మాత్ర‌మే కాకుండా… ఆ ఫ్లై ఓవ‌ర్‌పై యూట‌ర్న్ తీసుకున్న‌వాళ్లంతా ప్రాణాలు కోల్పోతారు. అస‌లు వాళ్లు చ‌నిపోవాడానికీ, ర‌చ‌న‌కీ సంబంధం ఏమైనా ఉందా? సుంద‌రం మ‌ర‌ణం విష‌యంలో ర‌చ‌న‌ని విచారించిన పోలీసుల‌కి ఎలాంటి విష‌యాలు తెలిశాయి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

U Turn Telugu Movie Review

ప్లస్ పాయింట్స్: సమంత తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఫస్ట్ హాఫ్ కథనంలో సప్సెన్స్ చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తోంది.. ఎస్ ఐ నాయక్ పాత్రలో అది పినిశెట్టి ఎప్పటిలాగే బాగా నటించారు. సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించిన భూమిక అండ్ క్లైమాక్స్‌లో ఆమె నటన సినిమాకి చాలా ప్ల‌స్‌ అయింది. అలాగే క్రైమ్ రిపోర్టర్ గా నటించిన రాహుల్ రవింద్రన్ కూడా ఉన్నంతలో తన నటనతో ఆకట్టుకుంటాడు. సస్పెన్స్ తో సీరియస్‌గా సాగుతున్న క‌థ, దర్శకుడు పవన్ ద‌ర్శ‌క‌త్వం ఈ సినిమాకు బాల‌న్ని చేకుర్చాయి.

మైనస్ పాయింట్స్: అక్క‌డ‌క్క‌డా వేగం త‌గ్గ‌డం, ప్రేక్ష‌కుడి ఊహకు అందే క‌థ‌నం..సమంత అండ్ రాహుల్ లవ్ ట్రాక్ కూడా చాలా బోరింగ్ గా సాగుతుంది. దీనికి తోడు సినిమా మొత్తం సింగిల్ పాయింట్ మీద నడవడం కూడా సినిమా పై విసుగు తెప్పిస్తోంది. సెకెండాఫ్ లోని కొన్ని దృశ్యాలు అనవసరంగా సాగాతీశారనిపిస్తోంది. చాలా చోట్ల స్క్రీన్ ప్లే వాస్త‌వంగా లేకపోవడం.

సాంకేతిక విభాగం: సినిమా ఉన్న‌తంగా ఉంది. ద‌ర్శ‌కుడు ప‌వ‌న్‌కుమార్ క‌థ‌ని న‌డిపిన విధానం ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా ఆయ‌న‌కి ఇలాంటి క‌థనాలోచ‌న రావ‌డ‌మే గొప్ప విష‌యం. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి ఏమాత్రం త‌గ్గ‌లేదు. పూర్ణ‌చంద్ర తేజ‌స్వి సంగీతం, నికేత్ బొమ్మిరెడ్డి కెమెరా నైపుణ్యం క‌థలో ఫీల్‌ని మ‌రింత ఎఫెక్టివ్‌గా పండించేందుకు దోహ‌దం చేశాయి.

U Turn Telugu Movie Review

తీర్పు: పవన్ కుమార్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సాగుతుంది. సినిమాలో అక్కడక్కడ వచ్చే ఊహించని సన్నివేశాలు, మిస్టరీకి సంబంధించిన సస్పెన్స్ ఎలిమెంట్స్ బాగున్నాయి. కానీ కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం. సెకెండాఫ్ లో కథనం చాలా చోట్ల స్లోగా సాగడం వంటి డ్రా బ్యాగ్స్ కారణంగా సినిమా స్థాయి తగ్గుతుంది.

మొత్తం మీద ‘యు ట‌ర్న్‌’లో థ్రిల్ ఉంది, సందేశం ఉంది! ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

సినిమా: యు ట‌ర్న్
విడుదల తేదీ : సెప్టెంబర్ 13, 2018
నటీనటులు : సమంత, భూమిక, ఆది పినిశెట్టి
సంగీతం : పూర్ణచంద్ర
దర్శకత్వం : పవన్ కుమార్
నిర్మాతలు : శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బండారు
రేటింగ్ : 3.5

- Advertisement -